ఈ నెల 31 నుంచి పద్మావతీ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఈ నెల 31 నుంచి పద్మావతీ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

పద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఇవాళ(మంగళవారం) ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్తోక్తంగా నిర్వహించారు ఆలయాధికారులు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఆగస్టు 30వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. భక్తుల వల్లగానీ, సిబ్బందితో గానీ తెలియక జరిగే దోషాల ప్రభావాన్ని నివారించడానికి ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.