జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్లలోని ఈఎస్ఐ. డిస్పెన్సర్సీ డాక్టర్లు, సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ రోగులు శనివారం ఆందోళన చేశారు. మందులు లేవంటూ నెలల తరబడి తిప్పుతున్నారని ఆరోపించారు. డిస్పెన్సరీకి ఉదయం వస్తే సిబ్బంది ఉండడం లేదని, సాయంత్రం వరకూ వేచిఉండాల్సి వస్తోందన్నారు. టైమింగ్స్పాటించడం లేదని, ముందుగానే మూసేసి వెళ్తున్నారని ఆరోపించారు.