కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో కలకలం రేగింది. రోగి బిల్డింగ్ అంతస్తు చివరి అంచుపై కూర్చొన్నాడు. దిగడానికి ఇష్టపడకపోవడంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అతడిని కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కిందకు దించేందుకు ప్రయత్నిస్తే.. దూకేస్తానని బెదిరిస్తుండడంతో అతడిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ ఆసుపత్రి (Institute of NeuroScience)లో చోటు చేసుకుంది.
వార్డులోంచి వెళ్లిపోయిన పేషెంట్.. బిల్డింగ్ రెయిలింగ్ పై కూర్చుని ఉండిపోయాడు. సిబ్బంది ఎంత పిలిచినా అక్కడి నుంచి దిగలేదు. దూకేస్తానని వారిని బెదిరించాడు. హైడ్రాలిక్ క్రేన్ తో రక్షించే ప్రయత్నం చేసినా దూకేస్తానని బెదిరించాడు. దీంతో అతడిని బుజ్జగించే పనిలో ఉన్నారు స్థానికులు. కానీ.. అతను అక్కడ ఎందుకు కూర్చొన్నాడో తెలియరావడం లేదని అగ్నిమాపక అధికారి Shubhankar Ghosh వెల్లడించారు. యూనిఫాంలో ఉన్న వారిని అతడు అనుమతించకపోవడంతో.. ఇతరులను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కిందకు దూకినా.. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు కింద పరుపులు, నెట్ ఉంచినట్లు వెల్లడించారు.
Kolkata, West Bengal | A patient has climbed out of a ward to sit on a highrise edge of the Institute of NeuroScience Hospital and is showing unwillingness to get down. Hydraulic ladder is reportedly being brought to bring him down pic.twitter.com/QWRhyhbhxq
— ANI (@ANI) June 25, 2022
Kolkata | He wasn't saying anything as to why he was sitting there, but was not allowing people in uniform to approach him. We had placed several mattresses, net. His treatment is ongoing: Fire officer, Shubhankar Ghosh pic.twitter.com/NywExSq1Fc
— ANI (@ANI) June 25, 2022
