AUS vs IND: ఇప్పటికీ మేమే ప్రపంచ ఛాంపియన్స్.. ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏం కాదు: కమ్మిన్స్

బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ  తొలి టెస్టులో ఇండియా 295 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. రన్స్ పరంగా ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతి పెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1–0తో ఆధిక్యంలోకి రావడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ)లో 61.11 పర్సెంటేజక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో  తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. నాలుగో రోజు, సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 534 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 58.4  ఓవర్లలో 238 స్కోరుకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్ పరాజయంతో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ చేసినా ఈ మ్యాచ్ లో కంగారూల జట్టు ఘోర పరాజయం పాలయింది. ఈ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. టెస్ట్ ర్యాంకింగ్స్ లో మేము నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాం. ఈ ఒక్క వారం మా ప్రదర్శనను తక్కువ చేయదు". అని కమ్మిన్స్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది. అయితే భారత్ ధాటికి అన్ని విభాగాల్లో విఫలమై ఓటమి మూట కట్టుకుంది. 

Also Read :- ఐపీఎల్ మెగా ఆక్షన్.. శ్రీకాకుళం కుర్రాడిని దక్కించుకున్న ఢిల్లీ

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హేజల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా  భారత పేసర్ల ధాటికి 104 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా గా  వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. జైస్వాల్ (161) కోహ్లీ (100) సెంచరీలతో చెలరేగారు. 534పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 237 పరుగులకే ఆలౌటైంది.