కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ కార్యవర్గంలోకి రాష్ట్రం నుంచి ముగ్గురు 

కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ కార్యవర్గంలోకి రాష్ట్రం నుంచి ముగ్గురు 
  •     కేసీ వేణుగోపాల్​ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, వెలుగు : కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ముగ్గురికి  పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అవకాశం కల్పించారు. ఇందులో బెల్లయ్య నాయక్ తేజావత్, పొదెం వీరయ్య, నరేశ్​ యాదవ్​ల పేర్లు ఉన్నాయి. ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ లో నేషనల్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ, నేషనల్ కోఆర్డినేటర్స్

 జాయింట్ కో ఆర్డినేటర్స్ ను నియమిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మొత్తం 30 మంది సభ్యులతో జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.