పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైం జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో మోసం

  • రూ. 9.79 లక్షలు కొట్టేసిన సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు

కామారెడ్డి, వెలుగు : పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైం జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పంపి, టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇచ్చిన సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ. 9.79 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పల్మారి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ నెల 9న పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో ఓ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది.అతడు జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓకే చెప్పడంతో అవతలి వ్యక్తులు కొన్ని టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇచ్చారు. వాటిని కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో కొంత అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

తర్వాత ఇంకా ఎక్కువ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేస్తే ఎక్కువ నగదు వస్తుందని, ఇందుకు కొంత డబ్బును డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మించారు. వాటిన నమ్మిన యువకుడు పలు విడతలుగా రూ. 9.79 లక్షలు పంపించాడు. తర్వాత శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబ్బులు పడకపోవడంతో మోసపోయానని గ్రహించి గురువారం టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.