జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్నాయి. రెండో దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు లోక్‌సభ, రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటి దశ సమావేశాల ప్రారంభంలో ఈ నెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్ క్రమంలో పాటించవలసిన నిబందనలను పాటిస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. గత సెప్టెంబర్‌ 14న ప్రారంభమయిన వర్షాకాల సమావేశాలు ప్రకటించిన సమయం కన్నా 8 రోజుల ముందే ముగిశాయి.