పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని  కేంద్ర నిర్ణయించింది. గతేడాది  కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు జరగలేదు. ఈసారి మహమ్మారి తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ప్రభుత్వ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించనున్నారు. ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు.. రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు, యూపీ లఖీంపూర్ ఖేరీ ఘటన, కశ్మీర్లో వరసగా ఉగ్రవాదుల దాడులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.