న్యూఢిల్లీ: పార్లమెంట్ దాడి ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను నిందితుడు లలిత్ ఝా రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కాలిపోయిన ఫోన్‌లను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.
పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటన తర్వాత లలిత్ ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయి అక్కడ నాగౌర్ జిల్లా త్రిశాంగ్య అనే గ్రామంలో బస చేసిన మహేష్ కుమావత్‌ను కలిశాడు. తర్వాత నలుగురి ఫోన్లతోపాటు మరికొన్ని ఆధారాలను వారు కాల్చేశారు. మహేష్ కుమావత్ బస చేసిన హోటల్‌కు దగ్గర్లో కాలిపోయిన ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
