చండీగఢ్: శిరోమణి అకాళీదళ్ సీనియర్ లీడర్, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఈసారి కూడా ఎన్నిక ల బరిలో నిలిచారు. సోమవారం లాంబి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన 94 ఏళ్ల బాదల్.. దేశంలో ఎన్నికల్లో నిలబడ్డ అతిపెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఈ రికార్డు ఇప్పటిదాకా కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ పేరిట ఉంది. 92 ఏళ్ల వయసులో ఆయన పోటీ చేశారు. ఇక పదకొండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాదల్.. ఐదు సార్లు సీఎంగా పనిచేశారు.
