పోలీసుల వింత ధోరణి.. ఖాళీ కుర్చీలతో మీడియా సమావేశం

ఏదైనా కేసుకు  సంబంధించిన విషయాలను మీడియాకు వివరాలు చెప్పాలంటే పోలీసులకు జర్నలిస్టులను పిలుస్తారు. వారు వచ్చాక కేసు వివరాలను,జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలను నివృత్తి చేస్తారు. కానీ  వికారాబాద్ జిల్లా పరిగి పీఎస్ లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలొస్తున్నాయి. 

ఓ హత్య కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు పోలీసులు. ఈ ప్రెస్ మీట్ కు మీడియా ప్రతినిధులు అటెండ్ కాలేదు. ఐతే ఖాళీ కుర్చీలకే వివరాలు చెప్పారు పరిగి సీఐ  శ్రీనివాస్ రావు. ఆ వీడియోలు,ఫోటోలు మీడియా ప్రతినిధుల గ్రూపులకు షేర్ చేశారు. 

ఖాళీ కుర్చీలు ఉన్నాయేంటని విలేకర్లు వాట్సప్ గ్రూప్ లో ప్రశ్నించారు. దీంతో కుర్చీలు కనిపించకుండా  మళ్లీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పోలీసులు. పరిగి పీఎస్ లో సీఐ, ఇతర సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.