Viral Video: ఓర్నాయనో.. ఆ  దుకాణం ఎదుట యూత్​ పోటెత్తింది... ఎందుకంటే..

హైటెక్​ యుగంలో ప్రపంచాన్ని సోషల్​మీడియా రాజ్యమేలుతుంది.  చీమ చిటుక్కుమంటే.. అది ఎలా అంది..ఎందుకంది.. ఇలా..ఎవరి తీరాన వారు ప్రతి చిన్న విషయాన్ని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసి సెలబ్రెటీలు అవుతున్నారు. అంతేకాదు ఏదైనా పాపులర్​ అవ్వాలంటే  జనాలు సోషల్​ మీడియానే ఎన్నుకుంటున్నారు.  ఇప్పుడు  ఓ పరోటా షాపు ఇంటర్నెట్​ ను కుదిపేస్తుంది.

Also Read:-రెస్క్యూ డ్రోన్.. వరదల్లో చిక్కకుంటే ఇలా కాపాడుతుంది..!

చంద్రిక గేరా దీక్షిత్ అనే ఢిల్లీకి చెందిన పరోటా పాప ఎవరో తెలియదు. చంద్రిక ఢిల్లీలోఓ బజార్​ లోపరోటాలను విక్రయించడం ప్రారంభించింది. మాములుగా సోషల్ మీడియాలో అమ్మాయిల వీడియోలకు మంచి క్రేజ్ ఉంది. కొంతమంది అమ్మాయిలు పద్దతిగా డ్రస్ చేసుకొని వీడియోలు చేస్తూ అభిమానులను సంపాదిస్తుంటే మరికొంతమంది తమ అందాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయికి సంబందించిన వీడియోనే వైరల్ అవుతుంది. ఈ వైరల్ వీడియోలో ఓ అందమైన యువతి పరోటాలు చేస్తూ కనిపించింది.

PUY ROTI LADY అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడీలో షేర్ చేసిన ఓ వీడియోలో ఒక అమ్మాయి రోడ్డు సైడ్ నిలబడి అరటిపండు పరోటా, గుడ్డు పరోటా అంటూ డిఫరెంట్ పరోటాలు అమ్ముతున్నది.   అయితే అక్కడ గంటల తరబడి క్యూలో నిలబడి జనాలు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ జనాలు పరోటా కోసం వెయిట్ చేస్తున్నారు. జనాలు అంతగా పోటెత్తేది పరోటాల కోసం అని అనుకుంటే మీరు ఎగ్గులో లెగ్గు వేసినట్టే.. మాములుగా పరోటాలు వేసే వారు ఎలా ఉంటారో మనకు ఓ అంచనా ఉంటుంది. కానీ ఇక్కడ పరోటాలు అమ్ముతుంది ఓ అమ్మాయి. పైగా అందాలు ఆరబోస్తూ ఆ పరోటాలు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. 

స్టైలీష్ లుక్‌లో బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్‌లో పరోటాలు అమ్ముతుంది ఆమె. దాంతో ఆమెను చూడటానికి కుర్రాళ్ళు క్యూ కడుతున్నారు. ఆమె అందాన్ని చూస్తూ అలా ఉండిపోతున్నారు. ఇంత అందమైన అమ్మాయి ఇలా పరోటాలు అమ్మితే ఆ మాత్రం క్యూ ఉంటుంది అని నెటిజన్స్ ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఈ అమ్మాయి అందం ముందు హీరోయిన్స్ పనికిరారు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PUY ROTI LADY (@puyrotilady)