ఎంఐ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా మాంబ్రే

ముంబై : టీమిండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ మాజీ కోచ్‌‌‌‌‌‌‌‌ పారస్‌‌‌‌‌‌‌‌ మాంబ్రే.. ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌తో చేరాడు. ఈ మేరకు మళ్లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా బుధవారం బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ లసిత్‌‌‌‌‌‌‌‌ మలింగ, హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌  జయవర్ధనేతో కలిసి అతను పని చేయనున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా హేమంగ్‌‌‌‌‌‌‌‌ బదానీని తీసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. సపోర్ట్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌లోకి మునాఫ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ కూడా రానున్నాడు. మరోవైపు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌,  అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌,   కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ను రిటేన్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.