సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పారామెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2439 ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది.
భర్తీ చేయనున్న ఖాళీలు..
మొత్తం 2439 ఖాళీలకు గాను AR-156, BSF- 365, CRPF-1537,ITBP- 130,SSB- 251 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు.. పారామెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గతంలో CAPF లో కానీ ఎక్స్ ఆర్మీ ఉద్యోగై ఉండాలి. (మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు).
ఎంపిక విధానం: ఎంపికైన అభ్యర్థులు CAPF ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పారామెడికల్ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఏజ్ లిమిట్: అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు.
.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
.. ఈ ఇంటర్వ్యూలను 13-09-2021 నుంచి 15-09-2021 వరకు నిర్వహించనున్నారు.
.. అభ్యర్థులను ఏడాది కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు.
.. ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకురావాల్సి ఉంటుంది.
.. రిటైర్మెంట్ సర్టిఫికేట్, డిగ్రీ, వయసు నిర్ధారణ, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్లను వెంట తెచ్చుకోవాలి.
వెబ్ సైట్: https://bit.ly/3xTiRkh
