Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్.. నేడు మూడు గోల్డ్ మెడల్స్‌పై భారత్ కన్ను

పారిస్ పారాలింపిక్స్ లో భారత్ నేడు కీలక మ్యాచ్ లు ఆడనుంది. సోమవారం(సెప్టెంబర్ 2) ఏకంగా మూడు గోల్డ్ మ్యాచ్ లు ఆడనుంది. రెండు బ్యాడ్మింటన్ విభాగంలో కాగా.. మరొకటి జావెలిన్ త్రో. బ్యాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్ SL4 గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో సుహాస్ యతిరాజ్ తలపడనున్నాడు. అతను సెమీ ఫైనల్ మ్యాచ్ లో సుకాంత్ కదమ్‌పై విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ SL3 గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో మరో భారత ప్లేయర్ నితేష్ కుమార్ ఆడతాడు. 

అథ్లెటిక్స్‌లో.. సుమిత్ యాంటిల్ గోల్డ్ మెడల్ పై కన్నేశాడు. అతను F64 పురుషుల జావెలిన్ ఫైనల్‌ ఆడనున్నాడు. అతని తో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లు సందీప్ సర్గర్, సందీప్ నేడు ఫైనల్ ఆడనున్నారు. శివరాజన్ సోలైమలై, నిత్య శ్రీ శివన్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ SH6 కాంస్య పతక పోరుకు సిద్ధమయ్యారు. పారిస్ పారాలింపిక్స్ 2024 లో భారత్ ఇప్పటివరకు ఏడు పతకాలను కైవసం చేసుకుంది