భల్లే భల్లే పంజాబ్ ..రాజస్థాన్ పై విక్టరీ

భల్లే భల్లే పంజాబ్ ..రాజస్థాన్ పై విక్టరీ

రాజస్థాన్‌ విజయానికి 42 బంతుల్లో 74 పరుగులు కావాలి. రాహుల్‌‌ త్రిపాఠి జోరు మీదున్నాడు. అండగా కెప్టెన్‌ రహానె ఉన్నాడు. చేతిలో మరోఎనిమిది వికెట్లున్నా యి. కాస్త ప్రయత్నిస్తే రాయల్స్‌ గెలుపు కష్టమేం కాదనిపిం చింది. పంజాబ్‌ కు మరో ఓటమి తప్పదనిపిం చింది. కానీ, కింగ్ స్‌ లెవెన్‌పోరాటం వదల్లేదు. అశ్విన్‌ ద్వయం పదునైన స్పి న్‌ తో ప్రత్యర్థిని వణికిం చింది. ధాటిగా ఆడుతున్న త్రిపాఠిని రవిచంద్రన్‌ .. ఆసీస్‌ చి చ్చరపిడుగుటర్నర్‌‌ను మురుగన్‌ ఔట్‌ చేసి మ్యాచ్‌ ను మలుపు తిప్పేశారు. షమీ, అర్ష్‌ దీప్‌ కూడా తలో చేయి వేసి పంజాబ్‌ కు ఘన విజయం కట్టబెట్టారు .మరోవైపు లీగ్‌ లో ఆరోసారి ఓడిన రాజస్థా న్‌ ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది.

మొహాలి: స్లో బ్యాటింగ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ కొంపముంచింది.కీలక సమయంలో రన్స్‌ చేయడంలో బ్యాట్స్‌ మెన్‌ విఫలమవడంతో రాయల్స్​ మరో పరాజయాన్ని మూటగట్టు కోవడంతో పాటు ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది.మరోవైపు ఆల్​రౌండ్​ ఆటతో అదరగొట్టినకింగ్స్​ లెవెన్​ పంజాబ్​ లీగ్​లో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ లో పంజాబ్‌ 12 పరుగులతో రాయల్స్​ను ఓడించింది. టాస్‌ ఓడిఫస్ట్‌‌ బ్యాటింగ్‌ కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 182 రన్స్‌చేసింది. ఓపెనరల్​ లోకేశ్​ రాహుల్‌ (47బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లతో 52)హా ఫ్‌సెంచరీ చేయగా, డేవిడ్‌ మిల్లర్‌ (27 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 40) రాణించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో జొఫ్రా ఆర్చర్‌ (3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌ లో 20 ఓవర్లు ఆడినరాజస్థాన్‌ ఏడు వికెట్లకు170 రన్స్‌ మాత్రమే చేసి ఓడిపోయింది. రాహుల్‌ త్రిపాఠి(45 బంతుల్లో 4ఫోర్లతో 50) హాఫ్‌ సెంచరీ చేయగా, స్టువర్ట్‌‌ బిన్నీ( 11బంతుల్లో 1ఫోర్‌ , 3 సిక్సర్లతో 31 నాటౌట్‌ )మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.పంజాబ్ బౌలర్లలో రవిచంద్రన్​ అశ్విన్‌ (2/24),అర్షదీప్‌ (2/43), షమీ(2/44) రెండేసి వికెట్లు పడగొట్టారు.

త్రిపాఠి రాణించినా...

భారీ ఛేజింగ్‌ లో రాజస్థా న్‌ మరోసారి  తడబడింది.రాహుల్‌ త్రిపాఠితో కలిసి జోస్‌ బట్లర్‌ (17 బంతుల్లో 1 ఫోర్‌ , 2 సిక్స్‌ లతో 22) ఇన్నింగ్స్‌ ను దూకుడుగానే ప్రారంభించాడు. అయితే ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో యువ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ ఈ జోడీని విడదీశాడు.అతని బౌలింగ్‌ లో భారీ షాట్‌ కు ప్రయత్నించిన బట్లర్‌ కీపర్‌ పూరన్‌ కుక్ యాచ్‌ ఇచ్చాడు. అయితే, త్రిపాఠితో కలిసి శాంసన్‌ (27) ఇన్నింగ్స్‌ ను గాడిలోపెట్టాడు. పది ఓవర్లు ముగిసే సరికి 89/1తో పటిష్ఠస్థితి లో నిలిచింది. పంజాబ్‌ బౌలర్లను సులువుగాఎదుర్కొన్న ఈ జోడీ రెండో వికెట్‌ కు 59 పరుగులుజోడించి జట్టు విజయానికి రాచబాట వేసింది.అయితే, 12వ ఓవర్లో శాంసన్‌ ను ఔట్​ చేసినపంజాబ్​ కెప్టెన్​ అశ్విన్​ ప్రత్యర్థికి షా కిచ్చాడు.విజయానికి చివరి ఆరు ఓవర్లలో 66 రన్స్‌అవసరమైన రాజస్థాన్​  బ్యాటింగ్‌ గాడితప్పింది. అశ్విన్‌ వేసిన 16వ ఓవర్లో స్టపౌటయ్యే  ప్రమాదం తప్పించుకున్న త్రిపాఠి 44 బంతుల్లో హాఫ్‌ సెం చరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వెంటనే భారీ షా ట్‌ కుప్రయత్నించి అశ్విన్​కే వికెట్​ ఇచ్చుకున్నా డు.లీగ్​లో తొలిసారి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సంచలనం టర్నర్‌ (0) డకౌట్‌ అయ్యాడు. ఆవెంటనే షమీ వేసిన 18వ ఓవర్‌ తొలి బంతి కిఆర్చర్‌ (1) అవుటవడంతో రాజస్థాన్​ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో  స్టువర్డ్‌ బిన్నీ భారీ షా ట్లతో ఆశలు రేపినా.. జట్టును ఒడ్డుకు చేర్చలేకపోయాడు.

రాహుల్‌‌‌‌, మిల్లర్‌‌‌‌ పోరాటం..

టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌ కు దిగిన పంజాబ్‌ కు సరైన ఆరంభం దొరకలేదు. విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌క్రిస్‌ గేల్‌ (30)తో పాటు రాహుల్‌ తొలుత నెమ్మదిగా ఆడడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి ఆ జట్టు39/1 స్కో రుతో నిలిచింది. ఐదో ఓవర్లోనే గేల్​నుఔట్​ చేసిన పేసర్‌ ఆర్చర్‌ పంజాబ్‌ కు షాకిచ్చాడు.వన్‌ డౌన్‌ లో వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ కాసేపుదూకుడుగా ఆడాడు. కానీ, అదే జోరులో ఇష్‌ సోధిబౌలిం గ్‌ లో భారీ షాట్‌ కు యత్నించిన అతనులాంగాన్‌ లో ఆర్చర్‌ కు క్ యాచ్‌ ఇచ్చాడు. తొలి పదిరన్స్‌ కు 21 బంతులు తీసుకున్న రాహుల్‌ నెమ్మదిగాగేరు మార్చాడు. మిల్లర్​తో కలిసి వేగం పెంచాడు.ఇష్‌ సోధి వేసిన14వ ఓవర్లో రాహుల్‌ , మిల్లర్‌ చెరోసిక్సర్‌ కొట్టి 19 రన్స్‌ రాబట్టారు. ఉనాద్కట్‌ వేసిన15వ ఓవర్లో  రాహుల్‌ 4,6 కొట్టగా… మిల్లర్‌ చక్కటి ఫ్లిక్‌ షాట్‌ తో సిక్సర్‌ బాదాడు. దాంతో, ఆ ఓవర్లో 20రన్స్‌ వచ్చాయి. ఈ ఇద్దరి జోరు చూస్తుంటే పంజాబ్‌భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, స్లాగ్‌ ఓవర్లలో రాజస్థా న్‌ బౌలర్లు పుంజుకున్నా రు. ఆర్చర్‌ కట్టు దిట్టంగా బౌలింగ్‌ చేశాడు. అతను వేసిన 17వ ఓవర్లో మిల్లర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయినా.. అది నోబాల్‌ కావడంతోబతికిపోయాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నవెంటనే ఉనాద్కట్‌ బౌలింగ్‌ లో రాహుల్ పెవిలియన్‌చేరడంతో మూడో వికెట్‌ కు 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక, 19వ ఓవర్లో.. నికోలస్‌పూరన్‌ (5), మన్‌ దీప్‌ సిం గ్‌ (0)ను ఔట్‌ చేసినఆర్చర్‌ మూడు పరుగులే ఇచ్చాడు. కులకర్ణి వేసినఆఖరి ఓవర్‌ తొలి బంతి కి మిల్లర్‌ ఔటైనా కెప్టెన్‌అశ్విన్‌ ఫోర్‌ , రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌ ను ఘనంగాముగించా డు. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్‌ 46రన్స్‌ చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.

స్కోరు బోర్డు

పంజాబ్‌ : రాహుల్‌ (సి) ఆర్చర్‌ (బి) ఉనా-ద్కట్‌ 52, గేల్‌ (సి) శాంసన్‌ (బి) ఆర్చర్‌30, మయాంక్‌ (సి) ఆర్చర్‌ (బి) సోధి 26,మిల్లర్‌ (సి) బట్లర్‌ (బి) కులకర్ణి 40, పూరన్‌ (-సి) రహానె (బి) ఆర్చర్‌ 5, మన్‌ దీప్‌ (బి) ఆర్చర్‌0, అశ్విన్‌ (నాటౌట్‌ )17, ముజీబ్‌ (నాటౌట్‌ ) 0;

ఎక్స్‌ ట్రాలు:12; మొత్తం: 20 ఓవర్లలో 182/6;

వికెట్ల పతనం: 1–38, 2–67,3–152, 4–163,5–164, 6–164; బౌలింగ్‌ : కులకర్ణి 4–0–37–1,ఉనాద్కట్‌ 4–0– 48–1, ఆర్చర్‌ 4–0–15–3, సోధి 4–0–41–1, గోపాల్‌ 4–0–31–0.

రాజస్థాన్‌ : త్రిపాఠి (సి) మయాంక్​ (బి) అశ్విన్​50, బట్లర్‌ (సి)పూరన్‌ (బి)అర్షదీప్‌ 23, శాంసన్‌ (బి) అశ్విన్‌ 27, రహానె (సి)షమి (బి) అర్షదీప్‌ 26; టర్నర్‌ (సి) మిల్లర్‌ (బి) మురుగన్‌ 0,ఆర్చర్‌ (సి)రాహుల్‌ (బి) షమీ 1, బిన్నీ (నాటౌట్‌ ) 31 ; గోపాల్‌(సి) మయాంక్​ (బి) షమి 0, ఉనాద్కట్​ (నాటౌట్​) 0,

ఎక్స్‌ ట్రాలు:10, మొత్తం: 20 ఓవర్లలో 168/7.

వికెట్ల పతనం : 1–38,2–97, 3 – 1 27, 4–131,5– 133, 6 –148, 7–160.బౌలిం గ్‌ : అర్షదీప్‌ 4–0–4 3–2, ముజీబ్‌ 3–0–24–0,మురుగన్‌ 4–0– 24–1, అశ్విన్‌ 4–0–24–2, షమీ 4–0–44–2, మన్‌ దీప్‌ 1–0–8–0Ipl,rajastan ,royals,