ఒక్క ఐడియా..ఫిదా అవుతున్న పానీపూరీ ప్రియులు

ఒక్క ఐడియా..ఫిదా అవుతున్న పానీపూరీ ప్రియులు

చిరుతిళ్లలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు పానీపూరిని ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తింటారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు మారాయ్. శుభ్రత పేరుతో భోజన ప్రియులు పానిపూరి తినడం మానేశారు. అయితే ఈ శుభ్రత వ్యాపారులకు కష్టంగా మారింది.

పాని పూరీ తినాలంటే పానీపూరితో పాటు వెల్లుల్లి, జీలకర్రతో చేసే వాటర్, కట్టామీటా, ఆనియన్స్ ఇవన్నీ కావాలి.

పానీ పూరీలో పూరీని చేతికి ఇచ్చిన తరువాత..పైన చెప్పిన ఆహార పదార్ధాల్ని చేతులతోనే ఇవ్వాలి. కానీ కరోనా కారణంగా అలా తీసుకునేందుకు ఇష్టంపడడంలేదు.

అందుకే ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ చెందిన పానీపూరీ వ్యాపారి బ్రహ్మాండమైన ఐడియాతో తన వ్యాపారంలో లాభాలు గడిస్తున్నాడు.సెన్సార్ తో పనిచేసేలా ‘టచ్‌ మీ నాట్‌ పానీపూరీ’ పేరుతో ఓ పానీ పూరీ మెషిన్ ను రెడీ చేశాడు.

పానీ పూరీ తినేందుకు ఎవరైనా వస్తే వారికి పేట్లో పూరీ పెట్టిస్తాడు. మిగిలిన ఆహార పదార్ధాలు కావాలంటే ఆ పానీ పూరీ మిషన్ కింద భాగంలో ప్లేట్ పెట్టేస్తే మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ప్లేట్లో పడిపోతుంది. ఆ తరువాత పానీపూరీని ఎంచక్కా తీనేయోచ్చు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరణ్‌ ట్విట్టర్‌లో పెట్టగా ట్రెండ్ అవుతోంది.