టీమిండియాలో మరో అన్నదముళ్ల జంట బరిలో దిగింది. తొలి సారి ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్ కలిసి అడుతున్నారు పాండ్యా బ్రదర్స్. న్యూజీలాండ్ పై ఫస్ట్ టీ20 జట్టుకు ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు. ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బుధవారం వెల్లింగ్టన్ పిచ్ పై రంగంలోకి దిగారు.
ఇలా ఇద్దరు అన్నదమ్ములు కలిసి టీమిండియా తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న మూడో బ్రదర్స్ పెయిర్ ఇది. వీరికి ముందు మొహిందర్, సురిందర్ అమర్నాథ్ బ్రదర్స్ కలిసి టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ లు ఆడారు. అలాగే ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్ సోదరులు కూడా వన్డేలు, టీ20ల్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగి చెలరేగిన రికార్డులున్నాయి.
గతంలో పాండ్యా బ్రదర్స్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీంలో కలిసి ఆడారు. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కలిసి పిచ్ లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. అయితే ఇద్దరూ విడివిడిగా టీమిండియాకు ఆడిన సందర్భాలున్నాయి. హర్థిక్ మిస్సైనప్పుడు కృనాల్ మెరిసిన మ్యాచ్ లు ఉన్నాయి.
2018 నవంబరులో కృనాల్ పాండ్యా తొలిసారి వెస్టిండీస్ పై టీ20లో టీమిండియా తరఫున ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో గాయం కారణంగా హార్థిక్ పాండ్యా ఆడలేదు. ఆ మ్యాచ్ లో కృనాల్ అద్భుతంగా ఆడి.. మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ కైవసం చేసుకోవడంలో తన వంతు పోరాడాడు. నవంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లోనూ కృనాల్ టీమ్ లో ఉన్నాడు.
ఇవాళ న్యూజీలాండ్ పై జరుగుతున్న టీ20లో భారత్ టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు 17 ఓవర్లలో న్యూజీలాండ్ టీమ్ 180 స్కోర్ చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది.
