టీడీపీకి షాక్: కాంగ్రెస్ లోకి కీలక నేత..!

2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీకి అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాటి నుండే మొదలైన అసమ్మతి సెగ ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానాన్ని ప్రకటించేంత వరకూ కొనసాగింది. తాజాగా మరొక కీలకనేత టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

టీడీపీకి చెందిన సీనియర్ నాయకురాలు పనబాక లక్ష్మి పార్టీకి రాజినామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె వచ్చే ఎన్నికల్లో తిరుపతి, లేదా బాపట్ల నుండి ఎంపీగా పోటీ చేయాలని భావించగా అధినేత చంద్రబాబు అందుకు సుముఖత చూపకపోవటంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పనబాక లక్ష్మి ఆమె భర్త పనబాక కృష్ణయ్యతో కలిసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతుందని సమాచారం అందుతోంది.గతంలో పనబాక లక్ష్మి కాగ్రెస్ నుండి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించటం గమనార్హం. మరి, తిరిగి సొంత గూటికి వెళ్తున్న లక్ష్మికి ఆశించిన సీటు దక్కుతుందో లేదో వేచి చూడాలి.