ఆధార్, పాన్ జాగ్రత్తగా లింక్ చేయండి..లేదంటే పదివేలు ఫైన్..?

ఆధార్, పాన్ జాగ్రత్తగా లింక్ చేయండి..లేదంటే పదివేలు ఫైన్..?

ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ లను లింక్ చేశారా..? లేదంటే ఇకపై మీ పాన్ కార్డ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరగవని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది.

కేంద్ర ఆర్ధిక శాఖ ఐటీ రిటర్న్ పే చేసేవాళ్లు తమ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ను లింక్ చేసి ఐటీశాఖకు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత సెప్టెంబర్ 30లోపు ఆధార్ కార్డ్ ను, పాన్ కార్డ్ ను లింక్ చేయాలని ఆదేశించింది. అయితే ట్రాన్సాక్షన్ల కోసం గడువును డిసెంబర్ 31కు పొడిగించింది.

ఆ గడువు దగ్గర పడుతుండడంతో ఐటీ రిటర్న్ పే చేసే వాళ్లు ఆధార్, పాన్ కార్డ్ ను లింక్ చేస్తున్నారు. గడువు తరువాత లింక్ చేసే ప్రయత్నం చేసినా సాధ్యపడదని ట్యాక్స్ ఎక్స్ పర్ట్ బల్వాత్ జైన్ చెబుతున్నారు.

లింక్ చేస్తే ఫర్వాలేదు. లేదంటే పాన్ కార్డ్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరిస్తున్నారు. కేంద్రప్రభుత్వం సైతం నిలిచిన పాన్ కార్డ్ లను ఎప్పుడు పున ప్రారంభిస్తామో చెప్పలేదని, కాబట్టి ఆధార్,పాన్ ను లింక్ చేయాలని జైన్ అన్నారు.

ఆధార్ , పాన్ లింక్ చేయడం ఎలా ..?

ఆధార్, పాన్ లింక్ చేసేందుకు రెండు మార్గాలున్నాయి. దీని కోసం, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 567678 లేదా 56161 కు SMS పంపాలి- UIDPAN <12 డిజిట్ ఆధార్ నంబర్> <10 డిజిట్ పాన్> పంపాలి.

ఉదాహరణకు- UIDPAN 123456789000 EPOPE1234E

ఆధార్, పాన్ జాగ్రత్తగా లింక్ చేయండి..లేదంటే పదివేలు ఫైన్ 

అతను ఆధార్-పాన్ పరస్పర మార్పిడి ఈ సెప్టెంబర్ నుండి అమల్లోకి వచ్చింది. పాన్ స్థానంలో ఆధార్ నంబర్‌ను కోట్ చేసేటప్పుడు జాగ్రత్తగా లింక్ చేయాలి.  ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ తప్పు ఆధార్ నంబర్ లేదా పాన్‌ను లింక్ చేసినందుకు రూ .10,000 జరిమానా విధించవచ్చు. మీరు తప్పు ఆధార్ లేదా పాన్ నంబర్‌ను లింక్ చేసిన ప్రతిసారీ ఈ జరిమానా విధించబడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272 బి కింద జరిమానా కట్టాల్సి ఉంది.