ఆధార్-పాన్ లింక్ డెడ్‌‌లైన్‌‌ పొడిగింపు

ఆధార్-పాన్ లింక్  డెడ్‌‌లైన్‌‌ పొడిగింపు

న్యూఢిల్లీ : ఆధార్–పాన్ లింక్ చేసుకునే గడువును ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఈ ఏడాది చివరి వరకు అంటే 2019 డిసెంబర్ 31 వరకు వీటి లింక్‌‌ను చేసుకోవచ్చని పేర్కొంది. అంతకుముందు ఆర్డర్ ప్రకారం ఈ రెండింటి లింక్ గడువు ఈ నెల చివరితో ముగుస్తుంది. ప్రస్తుతం ఎవరైతే ఆధార్‌‌‌‌తో పాన్‌‌ను లింక్ చేసుకోలేకపోయారో వారికి ఊరటనిస్తూ డెడ్‌‌లైన్‌‌ను మరింత పొడిగించింది. ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్(సీబీడీటీ) ఆధార్-–పాన్‌‌ లింక్ గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు ఒప్పుకుంది. తాజాగా చేసిన సవరణ ప్రకారం ఎవరైతే తుది గడువు వరకు ఆధార్‌‌‌‌తో పాన్‌‌ను లింక్ చేసుకోరో, వారి పాన్ కార్డు ఇన్‌‌ఆపరేటివ్ అయిపోతుంది. అయితే ఆగిపోయిన పాన్‌‌ కార్డు మళ్లీ వాలిడ్ అవుతుందో లేదో సీబీడీటీ చెప్పలేదు.  ట్యాక్స్​ పేయర్ల వినతి మేరకు తుదిగడువును పొడిగించింది’ అని ట్యాక్స్‌‌మ్యాన్.కామ్ డీజీఎం నవీన్ వాద్వా చెప్పారు.