ఆధార్​–పాన్​ ఇప్పుడూ లింక్​ చేసుకోవచ్చు

ఆధార్​–పాన్​ ఇప్పుడూ లింక్​ చేసుకోవచ్చు

న్యూఢిల్లీ: ఆధార్​ కార్డుతో పాన్​కార్డును లింక్​ చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు మార్చి 31తో అయిపోయింది. గత నెలలోపు లింక్​ చేసుకోని వారి పాన్​కార్డు ఇక నుంచి చెల్లదు. ఫలితంగా ఐటీ రిటర్నులు దాఖలు చేయడం, ఆస్తులు కొనడం, బ్యాంకుల్లో భారీ మొత్తం డిపాజిట్లు చేయడం వంటి పనులు కుదరవు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌ కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్‌‌‌‌ కార్డు హోల్డర్లందరూ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్ కావడం తప్పనిసరి. లేకపోతే రూ.వెయ్యి జరిమానా కూడా విధిస్తారు. అయితే ఇప్పటికీ లింక్​ చేసుకోని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. రూ.500 పెనాల్టీ చెల్లించడం ద్వారా లింక్​ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. లింకింగ్​ చేయడం ఎలాగో చూద్దాం..

ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్​సైట్​కు వెళ్లాలి. స్క్రీన్ ఎడమ వైపున ఉన్న 'క్విక్​ లింక్స్​' సెక్షన్​​ నుండి 'లింక్ ఆధార్' ఆప్షన్​ ఎంచుకోండి. ఇప్పుడు కొత్త విండో కనిపిస్తుంది. స్క్రీన్​పై కనిపించే స్లాట్​లో మీ పాన్ నంబర్, ఆధార్ డేటా, పేరు, మొబైల్ నంబర్‌‌‌‌ టైప్​ చేయాలి. సమాచారాన్ని వెరిఫై చేసిన తర్వాత, 'నా ఆధార్ వివరాలను వెరిఫికేషన్​ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను' అనే ఆప్షన్​ ఎంచుకోండి. ఆ తర్వాత, 'కంటిన్యూ' ఆప్షన్​పై నొక్కాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌‌‌లో ఇప్పుడు వన్-టైమ్ పాస్‌‌‌‌వర్డ్ వస్తుంది. స్క్రీన్‌‌‌‌పై కనిపించే ఖాళీలను పూరించి, ‘వాలిడేట్​’ ఆప్షన్​నొక్కాలి. పెనాల్టీ మొత్తం చెల్లించిన తర్వాత,  పాన్, ఆధార్ లింక్ అవుతాయి.