ఎడప్పాడి పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలకు కీలక పదవులను అప్పగించారు. సోమవారం జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం తర్వాత కేపీ మునుస్వామి, నతం విశ్వనాథన్ లను అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా నియమించారు. వీరితోపాటు మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలను సంస్థాగత కార్యదర్శులుగా నియమించారు. వీరిలో సెల్లూర్ రాజు, సివి షణ్ముగం, ధనపాల్, కెపి అన్బళగన్, కామరాజ్ ఆర్, ఒఎస్ మణియన్, కదంబూర్ రాజు, రాజేంద్ర బాలాజీ, బెంజమిన్, రాజన్ చెల్లప, బాల గంగ ఉన్నారు.
