పీజీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

  • డేట్స్ పొడిగించాలని విద్యార్థుల వినతి

మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఎగ్జామ్స్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఎంబీఏ 4వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 9 నుంచి 21 వరకు, రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 12 నుంచి 28 వరకు  నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎంసీఏ 4వ సెమిస్టర్ పరీక్షలు 9 నుంచి 16 వరకు, ఎంసీఏ 2, 3వ సెమిస్టర్ పరీక్షలు 12 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. అయితే, ఈ ఎగ్జామ్ డేట్స్ ను పొడిగించాలని పీయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజ్ కుమార్ కు పలువురు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు.ఈ నెల 5న డీఎస్సీ ఎగ్జామ్ ఉండడంతో చదువుకునే సమయం సరిపోవడం లేదన్నారు. ఈ మేరకు ఎగ్జామ్స్ తేదీల్లో మార్పులు చేయాలని కోరారు.