పాలమూరు తొలి మహిళా ఎంపీ అరుణ

మహబూబ్​నగర్, వెలుగు: మహబూబ్​నగర్​ పార్లమెంట్​కు 1952లో మొదటి సారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగినా, ఒక్క మహిళా ఎంపీ కూడా పార్లమెంట్​కు ఎన్నిక కాలేదు. ఇప్పటి వరకు జె రామశ్వర్​రావు, మల్లికార్జున్​ గౌడ్​ నాలుగు సార్ల చొప్పున, ఎస్​.జైపాల్​ రెడ్డి, ఏపీ జితేందర్​ రెడ్డి రెండేసి సార్లు, జనార్దన్​ రెడ్డి, ముత్యాల్​రావు, డి.విఠల్​రావు, కేసీఆర్, మన్నె శ్రీనివాస్​ రెడ్డి ఒక్కో టర్మ్​ ఎంపీలుగా చేశారు. కానీ, 2019 ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేయగా, 3,33,573 ఓట్లు సాధించి సెకండ్​ ప్లేస్​లో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లో 5,10,747 ఓట్లు సాధించి విజయం సాధించారు.