ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి : జగపతిరావు

నారాయణపేట, వెలుగు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని పాలమూరు జిల్లా సీనియర్  సిటిజన్  ఫోరం అధ్యక్షుడు జగపతిరావు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శీల గార్డెన్ లో పూసల్  పహాడ్​ టాలెంట్ టెస్ట్  విజేతలతో ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి టాలెంట్  టెస్ట్​లు ఉపయోగపడతాయని చెప్పారు. 

అనంతరం టాపర్లకు నగదు బహుమతిని, స్కూల్​ టాపర్లకు ప్రైజులు అందించారు. సెక్టోరియల్  ఆఫీసర్​ నాగార్జున రెడ్డి, హెచ్ఎం బాలకిష్టప్ప, జిల్లా సైన్స్  అధికారి భాను ప్రకాశ్, నోడల్  ఆఫీసర్  సురేశ్ కుమార్, ఏఈలు మహ్మద్ రఫీక్, అనిల్ కుమార్  పాల్గొన్నారు.