మామిడి ఎగుమతుల్లో పోటీ పడాలి : పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి

  • ఉమ్మడి జిల్లా ఆదర్శ రైతులకు అవగాహన సదస్సు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మామిడి పంట సాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధిక ఉత్పత్తులు సాధించి ప్రపంచ మార్కెట్ తో పోటీ పడాలని పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్ నగర్  కలెక్టరేట్ లో మామిడి క్లస్టర్  డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్  ప్రోగ్రామ్  కింద మామిడి తోటల నమోదు, ఎగుమతులు, దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌ పై ఉమ్మడి జిల్లా ఆదర్శ రైతులకు అవగాహన, ఇంటరాక్టివ్ సమావేశం జరిగింది. కలెక్టర్  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ALSO READ : రెవెన్యూ డివిజన్ దిశగా చేర్యాల..ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మామిడి ఎగుమతుల్లో భారతదేశం, ప్రపంచ మార్కెట్​లో పోటీ పడేలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘హార్టికల్చర్  క్లస్టర్  డెవలప్​మెంట్  ప్రోగ్రాం’ను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం కింద 11 రాష్ట్రాల్లోని 12 క్లస్టర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. మన రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా మామిడి పంటకు ఎంపిక చేసి, ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలో 17 వేల మంది రైతులు, 52,912 ఎకరాల్లో మామిడి  సాగు చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.165 కోట్ల బడ్జెట్ తో ప్రసాద్  సీడ్స్  ప్రైవేట్​ లిమిటెడ్ ను అమలు ఏజె న్సీ గా నేషనల్  హార్టికల్చర్  బోర్డు ద్వారా ఎంపిక  చేసినట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన రైతులకు కొత్త మామిడి తోటలకు పెట్టుబడి రాయితీ, పాత తోటల పునరుద్ధరణ, కొమ్మల కత్తిరింపులు, సమగ్ర సస్య రక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం, పంట కోతల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన, మార్కెటింగ్, బ్రాండింగ్  మొదలైన సదుపాయాలను కల్పించనున్నట్లు చెప్పారు. దీంతో మామిడి రైతులు కొత్త టెక్నాలజీ, సాంకేతిక పద్ధతులు, స్వదేశీ, విదేశీ మార్కెట్లపై అవగాహన పెంచుకొనే అవకాశం ఉంటుందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, హార్టికల్చర్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఉద్యాన శాఖ ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కొండా లక్ష్మణ్  బాపూజీ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం వీసీ  రాజిరెడ్డి, అడినల్  కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, హార్టికల్చర్​ డీడీ వి. బాబు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్  పాల్గొన్నారు.