నిరు పేదల సంక్షేమమే కాంగ్రెస్  ధ్యేయం : వంశీచంద్​రెడ్డి

 

జడ్చర్ల టౌన్/బాలానగర్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ఆ పార్టీ పాలమూరు క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డి తెలిపారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో ప్రచారం  నిర్వహించారు. జడ్చర్ల కావేరమ్మపేటలో ఇంటింటి ప్రచారం చేశారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజాపూర్, బాలానగర్​ మండల కేంద్రలల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. జడ్చర్ల ఫ్లై ఓవర్​ నుంచి నేతాజీ చౌరస్తా వరకు బైక్​ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్​ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే  నిరుపేదల కోసం రాజీవ్​ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. గతంలో తమ పార్టీ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లే ఇప్పటికీ ఉన్నాయని, గత ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా అందించలేదన్నారు. ఎన్నికల కోడ్​ ముగిసిన వెంటనే రూ.500కే సిలిండర్  అందిస్తామని, రేషన్​కార్డులు ఇస్తామని చెప్పారు. బాలానగర్​ నుంచి గంగాపూర్​ వరకు రూ.37 కోట్లతో రోడ్​ను మంజూరు చేయించానని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి మాట్లాడుతూ వంశీచంద్​రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే జడ్చర్లను వేగంగా అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.