ENG v PAK 2024: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. స్టార్ ప్లేయర్లతో పటిష్టంగా పాకిస్థాన్

అక్టోబరు 7 నుంచి స్వదేశంలో పాకిస్థాన్ ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ భాగంగా తొలి టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్థాన్ జట్టును మంగళవారం( సెప్టెంబర్ 24) ప్రకటించారు. తాజాగా తొలి టెస్ట్  కోసం ఆదివారం(అక్టోబర్ 6) ప్లేయింగ్ 11 ను ఎంపిక చేశారు. కెప్టెన్ షాన్ మసూద్ ఓపెనింగ్ టెస్ట్ మ్యాచ్ కు ముందు విలేకరుల సమావేశంలో ఆతిథ్య జట్టు లైనప్‌ను ధృవీకరించాడు. అక్టోబర్ 7 న ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు ముల్తాన్ వేదిక కానుంది.      

Also Read :- పాకిస్థాన్ తో కీలక పోరు.. టీమిండియా బౌలింగ్

బంగ్లాదేశ్ తో సిరీస్ లో చివరి టెస్టుకు దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్లు షహీన్ ఆఫ్రిది, నజీమ్ షా తిరిగి పాక్ జట్టులో చేరారు. ఆల్ రౌండర్ అమీర్ జమాల్ తొమ్మిది నెలల తర్వాత పాక్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఈ  ఆల్‌రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. బ్యాటింగ్ లో 143పరుగులు చేయడంతో  పాటు బౌలింగ్ లో 18 వికెట్లు తీశాడు. అతని రాకతో పాకిస్థాన్ మరింత పటిష్టంగా మారనుంది. ఈ టెస్ట్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:

సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అఘా, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అమీర్ జమాల్, నసీమ్ షా