IND vs PAK, Women's T20 World Cup 2024: పాకిస్థాన్ తో కీలక పోరు.. టీమిండియా బౌలింగ్

వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో భారత్ కీలక మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా చూస్తుంది. తొలి మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ పై భారీ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.  మరో వైపు తొలి మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచి పాకిస్థాన్ ఆత్మ విశ్వాసంతో ఉంది. 

భారత మహిళలు (ప్లేయింగ్ XI): 

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్ ), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, S సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్

పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI):

మునీబా అలీ(వికెట్ కీపర్ ), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా(కెప్టెన్), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్

ALSO READ | T20 World Cup 2024: పంత్ తెలివితేటలతో ప్రపంచ కప్ గెలిచాం..: రోహిత్ శర్మ