యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా వైరస్ తో మరణించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం లేకపోలేదు.
పాక్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ “డాన్” ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో బోరిస్ జాన్సన్ చనిపోయాడని తెలిపింది. అయితే ఆ వార్తలో నిజం లేదని తేల్చింది ఇండియా టుడే.
ఫ్యాక్ చెక్ లో పరిశీలించగా జాన్సన్ ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. అదే సమయంలో మీడియా సంస్థ డాన్ జాన్సన్ మరణించారని ప్రసారం చేసింది. దీన్ని బీబీసీ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ లో ప్రసారం కావడంతో అందరూ నిజమే అనుకున్నారు.
ఈ తప్పుడు కథనాలపై యూకే మంత్రిత్వశాఖ స్పందించింది. జాన్సన్ చనిపోయారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. యుకె క్యాబినెట్ మంత్రి మైఖేల్ గోవ్ ఏప్రిల్ 7 న ఎల్బిసి రేడియోతో మాట్లాడుతూ, ” ప్రధాన మంత్రికి బ్రీతింగ్ సమస్య లేదని, వెంటిలేటర్ ను తొలగించారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.
దీంతో “డాన్” ప్రచురించిన వార్తలు నిజం కాదని స్పష్టమైంది. యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా వైరస్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని తేలింది.
