PCB's Central Contract: పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్ట్.. ఐదుగురు సీనియర్ ఆటగాళ్లు ఔట్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 2024-25 అంతర్జాతీయ సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ఆదివారం (అక్టోబర్ 27) ప్రకటించింది. జూలై 1, 2024 నుండి ఈ కాంట్రాక్ట్ అమలులోకి వస్తుంది. సీనియర్ ప్లేయర్లు ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్ హక్, హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, సర్ఫరాజ్ ఖాన్ పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడ్డారు.

ఇంగ్లాండ్ తో రెండు, మూడు టెస్టులకు స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ను తప్పించగా.. అతనికి ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్ మద్దుతుగా నిలిచి పాక్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు. దీంతో వీరిద్దరికీ  సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడంతో పాటు ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ లకు సెలక్టర్లు చోటు కల్పించలేదు. 

ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ టెస్టు సిరీస్ విజయం తర్వాత.. టెస్ట్ కెప్టెన్  షాన్ మసూద్ కేటగిరీ డి నుండి కేటగిరీ బికి ప్రమోట్ అయ్యాడు.ఇంగ్లాండ్ తో చివరి రెండు టెస్టులకు చోటు దక్కించుకోలేకపోయిన స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది కేటగిరీ ఏ నుంచి బికి దిగజారింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మాత్రమే ఏ కేటగిరిలో కొనసాగుతున్నారు. 

Also Read :- అభిమానులకు, బీసీసీఐకి షమీ క్షమాపణలు

కేటగిరి ఏ: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్

కేటగిరి బి:నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మరియు షాన్ మసూద్

కేటగిరి సి: అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్ 
                  షాదాబ్ ఖాన్

కేటగిరి డి: అమీర్ జమాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మొహమ్మద్ అలీ, 
                 మహ్మద్ హుర్రైరా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ ఖాన్