ENG v PAK 2024: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్..పాక్ జట్టులో 37 ఏళ్ళ స్పిన్నర్‌కు చోటు

అక్టోబరు 7 నుంచి స్వదేశంలో పాకిస్థాన్ ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ భాగంగా తొలి టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్థాన్ జట్టును మంగళవారం( సెప్టెంబర్ 24) ప్రకటించారు. కెప్టెన్ గా విఫలమవుతున్న షాన్ మసూద్ కే సారధ్య బాధ్యతలు అప్పగించారు. సౌద్ షకీల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అక్టోబర్ 7 న ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో తొలి రెండు టెస్టులు ముల్తాన్ వేదికగా జరుగుతాయి. మూడో టెస్ట్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనుంది.       

ALSO READ | ENG vs AUS: ఇంగ్లాండ్‌ను నిలబెట్టిన బ్రూక్.. తొలి సెంచరీతోనే రికార్డ్

పేలవమైన ఫామ్ కారణంగా ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు తొలగించబడిన అఫ్రిది.. ఇంగ్లాండ్ తో ముల్తాన్‌ వేదికగా జరగబోయే తొలి టెస్ట్‌కు తిరిగి జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులకు ఎంపిక చేయని లెఫ్టార్మ్ స్పిన్నర్ 37 ఏళ్ళ నోమన్ అలీకి జట్టులో చోటు దక్కించుకున్నాడు.గాయం నుంచి ఇంకా కోలుకోని పేస్ బౌలర్ ఖుర్రుమ్ షెహజాద్ స్థానంలో అలీని తీసుకున్నారు. ఒకరిద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం పాక్ ఆటగాళ్లు అందరూ ఛాంపియన్స్ కప్‌లో జరుగుతున్న ప్లే ఆఫ్స్‌లో ఆడుతున్నారు.

పాకిస్థాన్ టెస్టు జట్టు:

షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), బాబర్ ఆజం, ముహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్, ముహమ్మద్ హురైరా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, అమీర్ జమాల్, నోమన్ అలీ, అబ్రార్ అహ్మద్, మీర్ హమ్జా, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా