బంగ్లాదేశ్ పై 0-2 తేడాతో స్వదేశంలో పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ ఓడిపోవడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో 550 పైగా పరుగులు చేసి ఓడిపోవడంతో పాక్ క్రికెట్ ఇక కోలుకోలేదని భావించారు. రెండో టెస్టుకు ముందు బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది, నజీమ్ షా లాంటి స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు ఏం చేస్తుందని నవ్వుకున్నారు. కట్ చేస్తే పాకిస్థాన్ ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. తీవ్ర ఒత్తిడిలోనూ పాకిస్థాన్ జట్టు పుంజుకున్న తీరు అత్యద్భుతం.
రావల్పిండి వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ పై పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇంగ్లాండ్ విధించిన 36 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసి గెలిచింది. షాన్ మసూద్ వేగంగా ఆడడంతో 3.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. మూడు వికెట్లకు 24 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 112 పరుగులకే ఆలౌటైంది.
పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమన్ అలీ ధాటికి ఏ ఒక్కరు క్రీజ్ లో నిలవలేకపోయారు. రూట్ (33), బ్రూక్ (26) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. సాజిద్ ఖాన్ 6 వికెట్లు తీసుకోగా.. నోమన్ అలీకి 4 వికెట్లు దక్కాయి. ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 344 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 267 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ కు 77 పరుగుల విలువైన ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 112 పరుగులకు ఆలౌట్ కాగా.. 36 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఒక వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది.
A huge victory for Pakistan in Rawal????di!https://t.co/UpfHrNPpBp | #PAKvENG pic.twitter.com/e4saYqLP06
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024