Pakistan Cricket: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ ఆల్‌రౌండర్ గుడ్ బై

మరో రెండు నెలల్లో సొంతగడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా.. పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం​ అంతర్జాతయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా శుక్రవారం(డిసెంబర్ 13) ప్రకటన చేశాడు. 

ఈ 35 ఏళ్ల ఆల్‌రౌండర్ ఇంతకుముందు 2023లో ఒకసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన కనపరచడంతో.. అతనితో సంప్రదింపులు జరిపి సెలెక్లర్లు తిరిగి జట్టులో చోటు కల్పించారు. అంతర్జాతయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా..  ప్రపంచవ్యాప్తంగాజరిగే ఫ్రాంచైజీ క్రికెట్ లో కొనసాగుతానని ఇమాద్ తెలిపాడు.

ఇమాద్ పాకిస్థాన్ తరపున 75 టీ20లు, 55 వన్డేలు ఆడాడు. మొత్తంగా వైట్-బాల్ ఫార్మాట్‌లో 1,540 పరుగులు, 117 వికెట్లు పడగొట్టాడు. ఇమాద్ పాకిస్థాన్ తరపున ఎలాంటి టెస్టు క్రికెట్ ఆడలేదు.