జీడిమెట్ల, వెలుగు: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ పేట్ బషీరాబాద్పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు రలించారు. యూపీకి చెందిన ఎండీ ఫీరోజ్ (42) ఉపాధి కోసం వచ్చి దూలపల్లిలోని ప్రశాంత్‌నగర్‌లో పెయింటర్‌గా పని చేస్తున్నాడు.
ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి అమ్ముతున్నాడు. దూలపల్లి స్టీల్ సిటీ సమీపంలో శనివారం గంజాయి అమ్ముతుండగా, పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.1.95 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.