పాగుంట వెంకన్న బ్రహ్మోత్సవాలు షురూ

కేటి దొడ్డి, వెలుగు : మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెలిసిన పాగుంట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మార్కెట్  కమిటీ చైర్మన్  హనుమంతు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

రాత్రి 7 గంటలకు స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదటి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.