నా చావుకు ముఠా రేణుక కారణం.. కలకలం రేపుతున్న పీఏసీఎస్​ డైరెక్టర్ సూసైడ్ నోట్

  • వెంకట్రావుపేటలో సూసైడ్ నోట్ రాసి పీఏసీఎస్​ డైరెక్టర్ సూసైడ్
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేటలో ఘటన

కోనరావుపేట, వెలుగు: తన చావుకు ముఠా రేణుక కారణమని సూసైడ్​ నోట్​ రాసి పీఏసీఎస్​ డైరెక్టర్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పల్లం సత్తయ్య(62) పీఏసీఎస్​ డైరెక్టర్. ఈ క్రమంలో కోనరావుపేట మండలం నిజామాబాద్  క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ కు చెందిన ముఠా రేణుక సీసీగా పని చేస్తుంది. రేణుక వేములవాడలో సత్తయ్య ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో కిరాయికి ఉంటూ ఉద్యోగం చేస్తుండేది. తనకు పక్కింటి వారితో సమస్య ఉందని పరిష్కరించాలని సత్తయ్యను ఇంటికి పిలిచి 2017లో వలలో వేసుకుంది. 

అప్పటి నుంచి సత్తయ్యను నిత్యం వేధిస్తూ బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.25 లక్షలు కాజేసింది. ఇటీవల కరీంనగర్ లో రూ.40 లక్షల ఇల్లు కొనివ్వాలని వేధింపులకు పాల్పడింది. అంతేకాకుండా సుఖంగా ఉండాలంటే తన భర్తనైనా, లేక నీ భార్యనైనా చంపాలని సత్తయ్యపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ వ్యవహారం నచ్చక 4 నెలల కింద సత్తయ్య సూసైడ్‌‌‌‌‌‌‌‌  అటెంప్ట్​ చేశాడు. కుటుంబసభ్యులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేర్చగా బతికి బయటపడ్డాడు. 

అప్పటి నుంచి అతను రేణుకకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో రేణుకతో పాటు ఆమె తమ్ముడు అశోక్  సైతం కరీంనగర్​లో ఇల్లు కొనివ్వాలని, లేదంటే చంపేస్తానని సత్తయ్యను బెదిరించడంతో మనోవేదనకు  గురై సూసైడ్ నోట్ రాసి శనివారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. స్థానికులు ఎల్లారెడ్డిపేట ప్రైవేట్  హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. 

ప్రముఖుల నివాళి..

సత్తయ్యకు ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వేములవాడ బీఆర్ఎస్  ఇన్​చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, సీనియర్  నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్లు సంకినేని రామ్మోహన్​రావు, బండ నరసయ్య, వైస్  చైర్మన్లు భూమిరెడ్డి, మహేశ్, సర్పంచ్​లు ఫోరం మాజీ అధ్యక్షుడు సంతోష్  నివాళులు అర్పించారు.