సొసైటీ ద్వారా రైతులకు హౌజింగ్ లోన్లు : పీఏసీఎస్ ​చైర్మన్​ హన్మంతరెడ్డి

మెదక్​, వెలుగు: సొసైటీ ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, క్రాప్​ లోన్లు ఇవ్వడంతో పాటు, సభ్యులకు హౌసింగ్ లోన్లు మంజూరు చేస్తున్నట్టు మెదక్  ప్రైమరీ అగ్రికల్చర్​కో ఆపరేటివ్ సొసైటీ (పీఏసీఎస్) చైర్మన్​ చిలుముల హన్మంతరెడ్డి, వైస్​ చైర్మన్​ కాస సూర్యతేజ తెలిపారు. సోమవారం సొసైటీ జనరల్​ బాడీ మీటింగ్​ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 37 సొసైటీలు ఉండగా, పంట సీజన్​లలో 52 సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తూ మెదక్ సొసైటీ ఫస్ట్​ ప్లేస్​లో ఉంటుందన్నారు. ఎరువుల అమ్మకాల్లో సైతం స్టేట్​లెవల్​లో టాప్​ -5 లో ఉంటుందన్నారు.

ఒక సీజన్​లో 40 వేల బస్తాల పాస్పెట్ అమ్ముతున్నట్టు తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలకు కొరత లేకుండా చూస్తున్నామన్నారు. సొసైటీ డిపాజిట్లు రూ.7 కోట్ల వరకు ఉండగా, రూ.లక్ష లోపు రుణమాఫీ అయిన రైతులకు 90 శాతం మందికి మళ్లీ లోన్లు ఇచ్చామని వెల్లడించారు. సొసైటీ పరిధిలోని పేరూర్​గ్రామంలో 5 షాప్ లు, రాజ్ పల్లి, ర్యాలమడుగులో గోదాములు కడుతున్నట్టు తెలిపారు. సొసైటీ పరిధిలో రైతుల పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తామని చెప్పారు. సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.