ప్రపంచమంతా ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ రిజల్ట్ ను ఈ ఏడాదిలోపే ప్రారంభించాలని భావిస్తుంది. అయితే సైంటిస్ట్ లు మాత్రం వ్యాక్సిన్ రిజల్ట్ రావడానికి సమయం పడుతుందని అంటున్నారు.
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. బిలియన్ల మంది ప్రజల సాధారణ జీవితం తలకిందులుగా మార్చింది కరోనా. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే కరోనా వ్యాక్సినే విరుగుడని సైంటిస్ట్ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పొల్లార్డ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చివరి నాటికి మూడోదశ ట్రయల్స్ పూర్తి చేస్తామన్నారు. వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో,పనిచేస్తే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉందని పొలార్డ్ చెప్పారు. ఆ తరువాత డేటాను పరిశీలించి, ఫస్ట్ వ్యాక్సిన్లను ఎవరికి ఇస్తామని నిర్ణయం తీసుకుంటామన్నారు. క్రిస్మస్ కు ముందే వ్యాక్సిన్ వస్తుందా అన్న ప్రశ్నకు..వ్యాక్సిన్ వచ్చే అవకాశం. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియని చెప్పారు.
