మోడీ చెప్పుచేతల్లో అన్నాడీఎంకే

మోడీ చెప్పుచేతల్లో అన్నాడీఎంకే

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఇక ఎంతమాత్రం జయలలిత పార్టీ కాదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పూర్తిగా ప్రధాని చేతుల్లోకి వెళ్లిందని, ఆ పార్టీ మోడీ బానిసగా మారిందన్నారు. ‘అన్నాడీఎంకే ఎంతమాత్రం మేడం జయలలిత పార్టీ కాదు. ఈ పార్టీని బీజేపీ తన అధీనంలోకి తెచ్చకుంది. ప్రస్తుతం అన్నాడీఎంకే నరేంద్ర మోడీ బానిసగా ప్రవర్తిస్తోంది’ అని ఒవైసీ చెప్పారు.