జనవరి 1న మనదేశంలో సుమారు 60 వేల మంది చిన్నారులు పుట్టినట్లు యునిసెఫ్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 1న 3.7 కోట్ల మంది చిన్నారులు జన్మించగా ఒక్క భారత్ లో 60 వేల మంది చిన్నారులు జన్మించినట్లు యునిసెఫ్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రపంచ దేశాల్లో నెల, ప్రతీరోజూ ఎంతమంది జన్మించారనే అంశంపై హౌస్ హోల్డ్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో వరల్డ్ పాపులేషన్ – 2019 ప్రకారం జనవరి 1, 2021 రోజున భారత్ లో ఒక్కరోజు 60వేల మంది చిన్నారులు జన్మించగా, చైనాలో (35,615), నైజీరియాలో (21,439), పాకిస్తాన్ లో(14,161), ఇండోనేషియాలో (12,336)ఇథోఫియాలో( 12,006), యూఎస్ లో (10,312), ఈజిప్ట్ (9,455), బంగ్లాదేశ్ లో (9,326), రిపబ్లిక్ ఆఫ్ ది కాంగ్ లో (8,640)మంది జన్మించినట్లు యునిసెఫ్ సంస్థ తెలిపింది.
