అవినీతిపై హెల్ప్ లైన్ : 4 నెలల్లో 3 లక్షలకు పైగా ఫిర్యాదులు

అవినీతిపై హెల్ప్ లైన్ :  4 నెలల్లో 3 లక్షలకు పైగా ఫిర్యాదులు

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 23న అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారుల  ఆడియో లేదా వీడియోను పంచుకొడానికి ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.

అయితే  ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, ప్రతిరోజూ 2,500 ఫిర్యాదులు అందుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. అవినీతికి పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్ లో తెలిపింది. మా కల అవినీతి రహిత పంజాబ్ అని స్పష్టం చేసింది.

అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో పరిశీలిస్తుంది.