అనారోగ్యం అని చెప్పి  ఈ ఆటలేంటి ?

అనారోగ్యం అని చెప్పి  ఈ ఆటలేంటి ?
  •     మొన్న బాస్కెట్‌‌ బాల్‌‌, నిన్న గర్బా డ్యాన్స్‌‌.. 
  •      ఇయ్యాల క్రికెట్‌‌ ఆడిన ఎంపీ
  •     మాలేగావ్‌‌ పేలుళ్ల కేసులో బెయిల్‌‌పై బయటికి.. 
  •     అనారోగ్యం అని చెప్పి ఈ ఆటలేంటని ప్రతిపక్షాల ఫైర్‌‌‌‌


భోపాల్‌‌‌‌: మాలేగావ్‌‌‌‌ పేలుళ్ల కేసులో ఆరోగ్య కారణాలు చూపుతూ బెయిల్‌‌‌‌పై బయటకు వచ్చిన భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. హెల్త్‌‌‌‌ బాగోలేదని చెప్పి బెయిల్‌‌‌‌ తీసుకున్న ఆమె ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ గేమ్స్‌‌‌‌ ఆడుతున్నారన్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొన్న బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌, నిన్న గర్బా డ్యాన్స్‌‌‌‌, తాజాగా క్రికెట్‌‌‌‌ ఆడిన ఠాకూర్‌‌‌‌‌‌‌‌ వీడియోలు బయటకు వచ్చాయి. భోపాల్‌‌‌‌లోని శక్తి నగర్‌‌‌‌‌‌‌‌లో క్రికెట్‌‌‌‌ ఆడిన ఆమె వీడియోలు ప్రస్తుతం సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌గా మారాయి. పక్కనున్న వారు ప్రగ్యాను ఎంకరేజ్‌‌‌‌ చేస్తూ చప్పట్లు కొట్టడం కనిపించింది. అలాగే అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రగ్యా ఠాకూర్‌‌‌‌‌‌‌‌ గర్బా డ్యాన్స్‌‌‌‌ చేశారు. అంతకుముందు భోపాల్‌‌‌‌లో బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌ ఆడారు. కాళి టెంపుల్‌‌‌‌ను విజిట్‌‌‌‌ చేసినప్పుడు మహిళా ప్లేయర్స్‌‌‌‌తో కబడ్డీ ఆడారు. 2008 మాలేగావ్‌‌‌‌ పేలుళ్ల కేసుల్లో ప్రగ్యా ఠాకూర్‌‌‌‌‌‌‌‌ నిందితురాలిగా ఉన్నారు. ఆరోగ్య కారణాలరీత్యా 2017లో నేషనల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ ఏజెన్సీ(ఎన్‌‌‌‌ఐఏ) స్పెషల్‌‌‌‌ కోర్టు ఆమెకు బెయిల్‌‌‌‌ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో భోపాల్‌‌‌‌ నుంచి ప్రగ్యా ఠాకూర్​  ఎంపీగా గెలుపొందారు.