డిమాండ్ రికవరీ అవుతుందని అంచనా
డిజిటల్ టూల్స్‌తో బయ్యర్లను ఆకట్టుకుంటున్నారు
ప్రభుత్వ చర్యలు రికవరీకి బాటలేస్తాయ్
తగ్గిన వడ్డీ రేట్లు సహకరిస్తాయంటోన్న డెవలపర్లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నుంచి ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అప్పటి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ కరోనా దెబ్బకు ఈ ఏడాది కూడా రియాల్టీ రికవరీ కాలేకపోయింది. ఆఖరికి కొత్త ఏడాదిపై కోటి ఆశలు పెట్టుకుంది ఇండియన్ రియాల్టీ సెక్టార్. కొత్త ఏడాదిలో సేల్స్‌లో రికవరీ సాధించాలని ఇండస్ట్రీ చూస్తోంది. ప్రాపర్టీ ధరల్లో స్థిరత్వం, హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గడం, గృహ కొనుగోలుదారుల కోసం డెవలపర్లు ఆఫర్లను ప్రవేశపెట్టడం, కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీని తగ్గించడం వంటివి రియాల్టీ సెక్టార్‌ను రికవరీ బాటలో నడిపిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది కరోనా దెబ్బకు హౌసింగ్ సేల్స్, ఆఫీసు స్పేస్ లీజింగ్ 40–50 శాతం వరకు పడిపోయాయి. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంతో ఈ ఏడాది రెండున్నర నెలల పాటు రియాల్టీ సెక్టార్‌లో ఎటువంటి యాక్టివిటీ లేదు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత డెవలపర్లు డిజిటల్ టూల్స్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకోవడం ప్రారంభించారు. ఫెస్టివ్ డిమాండ్‌తో అక్టోబర్ నెలలో ప్రాపర్టీ మార్కెట్‌లో కాస్త రికవరీ కనిపించింది. అయినప్పటికీ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ రిపోర్ట్ ప్రకారం మేజర్ సిటీలు హైదరాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్), ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లలో హౌసింగ్ సేల్స్ ఈ ఏడాది 47 శాతం తగ్గి 1.38 లక్షల యూనిట్లుగా రికార్డయ్యాయి.
సంస్కరణలతో కొన్నేళ్లుగా ఇబ్బందులు…
మహారాష్ట్ర ప్రభుత్వం తగ్గించిన స్టాంప్ డ్యూటీ ఇటు డెవలపర్లకు, అటు కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చింది. ముంబై, పుణే నగరాల్లో డిమాండ్ రికవరీకి సాయం చేసింది. కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరూ సొంతిళ్ల ప్రాముఖ్యతను గుర్తించారు. ఎక్కడైనా చిన్న ఇల్లు ఉన్నా చాలు అనే ఆలోచన చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని సంస్కరణల వల్ల రియాల్టీ సెక్టార్ దెబ్బతిందని రియాల్టీ అపెక్స్ బాడీ క్రెడాయ్ ఛైర్మన్ జాక్సయ్ షా అన్నారు. జీఎస్టీ, డిమానిటైజేషన్, రెరా వంటి సంస్కరణల వల్ల రియాల్టీ సెక్టార్ ప్రభావితమైనట్టు పేర్కొన్నారు. దీనికి తోడు కరోనా మహమ్మారి ఈ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేసిందని అన్నారు. ‘గత కొన్నేళ్లుగా పలు సవాళ్లను రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎదుర్కొంది. కరోనా రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో పరిస్థితులను మరింత భారంగా మార్చింది. ఈ సెక్టార్‌పై ఆధారపడ్డ ఉద్యోగాలు, జీవితాలను ప్రమాదంలోకి నెట్టింది’ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ సతీష్ మాగర్ అన్నారు. లాక్‌డౌన్ తర్వాత సేల్స్ కాస్త మెరుగవుతున్నాయని, కానీ చాలా సిటీల్లో ఇంకా ప్రీ కరోనా లెవెల్స్ ను ఇవి తాకలేదని పేర్కొన్నారు. కానీ రియాల్టీ సెక్టార్ రికవరీ అవుతుందని చాలా సంకేతాలు సూచిస్తున్నాయని మాగర్ తెలిపారు.
షాపింగ్ మాల్ ఓనర్లకు బాగా దెబ్బ…
అన్ని సెగ్మెంట్లలో కెల్లా రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో షాపింగ్ మాల్ ఓనర్లు కరోనా కారణంగా ఎక్కువగా నష్టపోయారు. ఫుట్‌ఫాల్స్ తగ్గిపోయాయి. రిటైలర్స్‌కు తప్పనిసరి పరిస్థితుల్లో అద్దెలు మాఫీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఛాలెజింగ్‌గా ఉన్నా.. రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు మంచి రోజులు ఎంతో దూరంలో లేవని షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ కొత్త ఏడాదిపై ఆశతో ఉన్నట్టు పేర్కొన్నారు.
రికవరీ కోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు..
రియాల్టీ రికవరీ కోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకున్నట్టు క్రెడాయ్ ప్రెసిడెంట్ గుర్తు చేశారు. కానీ ఎప్పటి నుంచో వస్తోన్న సమస్యలను ఇంకా ప్రభుత్వం గుర్తించలేదని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్‌లోనైనా డిమాండ్, సప్లయి వైపు ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రైసిస్ నుంచి డెవలపర్లను కాపాడేందుకు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే డెడ్‌లైన్ ఆరునెలల నుంచి తొమ్మిది నెలలకు ప్రభుత్వం పెంచింది. దీని కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్(రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్(రెరా) కింద ఫోర్స్ మెజ్యూర్ నిబంధనను రద్దు చేసింది. అంతేకాక 2021 మార్చి వరకు మధ్య తరగతి ప్రజలకు ఇంటరస్ట్ సబ్సిడీని పొడిగించింది. వన్ టైమ్ లోన్ రీస్ట్రక్చరింగ్‌ను చేపడుతోంది. ధరలు పెరిగే వరకు డెవలపర్లు ఆగకుండా అమ్ముడుపోని ఇన్వెంటరీని క్లియర్ చేసుకోవాలని కేంద్ర మంత్రులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయడం కోసం రూ.25 వేల కోట్ల స్ట్రెస్ ఫండ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఫండ్స్‌ను పొందాలంటే ఎలిజిబిలిటీ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయని కొందరు డెవలపర్లు విమర్శిస్తున్నారు.
ఆఫీసు స్పేస్ మార్కెట్ పడింది…
మరోవైపు ఇండియాలో ఆఫీసు మార్కెట్ కూడా కరోనా దెబ్బకు ప్రభావితమైంది. ఆఫీసుల లీజింగ్ 2020లో 25 నుంచి 27 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. గతేడాది ఇది రికార్డు స్థాయిలో 46.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు జేఎల్‌ఎల్ ఇండియా రిపోర్ట్‌లో వెల్లడైంది. కరోనాతో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేయడంతో కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. దీంతో ఆఫీసు డిమాండ్ పడిపోయింది. కరోనా రాకపోయింటే ఆఫీసు మార్కెట్ మరింత ఆకర్షణీయంగా ఉండేది. కరోనా మహమ్మారి ఉన్న సమయంలోనే ఇండియాలో రెండో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్), మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సక్సెస్‌ఫుల్‌గా మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. ఈ లిస్టింగ్‌లు ఆఫీసు మార్కెట్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీని సూచిస్తున్నాయి. లాంగ్ టర్మ్ గ్రోత్‌పై ఆశలతో రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో కొన్ని బ్లాక్ బాస్టర్ డీల్స్ కూడా జరిగాయి.
For More News..
విరాట్ నావల్లే అవుట్ అయ్యాడు.. లేకపోతే మ్యాచ్ పోయేది కాదు
పార్కింగ్ ప్లేస్‌లు లేవు కానీ.. బండ్లకు ఫైన్లు
గోల్‌కీపర్లకు 644 బీర్లు పంపిన బీర్ కంపెనీ
