- రాజ్యసభలో సైన్స్అండ్టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: మానవ సహిత అంతరిక్ష యాత్ర‘గగన్‌యాన్’ను 2023లో చేపట్టనున్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. అయితే గగన్ యాన్కంటే ముందు 2022లో వీనస్ మిషన్, సోలార్ మిషన్ లలో భాగంగా 2 స్పేస్ క్రాఫ్ట్‌లను ప్రయోగించనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఇస్రో ప్రాజెక్టుల స్టేటస్ గురించి మంత్రి తెలిపారు.
2022 నాటికి వీనస్ మిషన్, 2022–23లో ఆదిత్య సోలార్ మిషన్, 2030 నాటికి మన సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు పే–ర్కొన్నారు. దేశ అంతరిక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, స్వదేశీ స్టార్టప్‌లపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 34 దేశాల నుంచి 42 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిందని, దీనిద్వారా రూ. 423 కోట్ల ఆదాయం వచ్చిందని సింగ్సభలో తెలిపారు.
