మా బాబా సీఎంకు ఏం తెలియదు

మా బాబా సీఎంకు ఏం తెలియదు

యూపీలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రేపు మూడోదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు జోరుగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్... యూపీ సీఎం యోగిపై కామెంట్స్ చేశారు. మా  బాబా సీఎం అద్భుతం (కమాల్ కే హై) అన్నారు. ఆయన ఇంతకు ముందు ఏమీ తెలియదు, ప్రస్తుతం కూడా ఏం తెలియదని సెటైర్లు వేశారు. యూపీ ఎన్నికలు రైతుల హక్కులు, యువత ఉపాధి, రాష్ట్రాభివృద్ధి కోసమే అన్నారు అఖిలేశ్. 

లఖింపూర్ ఖేరీ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆశిష్ మిశ్రాపై కూడా అఖిలేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా న్యాయస్థానంలో ఆశిష్ మిశ్రాకు ఇంకా బెయిల్ లభించలేదన్నారు. బిజెపి విధానాల వల్ల రైతులు, వారి కుటుంబాలు చాలా నష్టపోయాయన్నారు. ఇది బిజెపికి ఓటమిని కలిగిస్తుందన్నారు. లఖింపూర్ ఖేరీ కేసు మనకు స్వతంత్ర భారతదేశంలో జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తు చేస్తోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.