- అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపులు ఆపాలి
- ఓయూ జేఏసీ నాయకులు
ఓయూ, వెలుగు : అల్లు అర్జున్‌కు వెంటనే క్షమాపణలు చెప్పకపోతే చంపేస్తామని ఆయన మనుషులు బెదిరిస్తున్నారని ఓయూ జేఏసీ నాయకులు ఆరోపించారు. బెదిరింపు కాల్స్ మళ్లీ వస్తే 30 వేల మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓయూ జేఏసీ నాయకులు రెడ్డి శ్రీనివాస్, బైరు నాగరాజు మాట్లాడుతూ.. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో కాల్స్ చేస్తూ బెదిరిస్తున్నారని
తన అనుచరులతో కాల్స్ రాకుండా అల్లు అర్జున్ చూసుకోవాలని కోరారు. ఓయూ జేఏసీ నేతల నంబర్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలమంది స్టూడెంట్స్‌తో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.