హైదరాబాద్ లో ఒప్పో 5జీ ఇన్నొవేషన్‌ ల్యాబ్‌

హైదరాబాద్ లో ఒప్పో 5జీ ఇన్నొవేషన్‌ ల్యాబ్‌
చైనాకు వెలుపల ఇదే మొదటిది హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌లో 5జీ ఇన్నొవేషన్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని స్మార్ట్‌‌‌‌ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పొ మంగళవారం ప్రకటించింది. చైనాకు వెలుపల కంపెనీకి ఇదే మొదటి 5జీ ల్యాబ్‌‌‌‌ అని తెలిపింది. కెమెరా, పవర్‌‌‌‌‌‌‌‌ అండ్ బ్యాటరీ, పెర్ఫార్మెన్స్‌‌‌‌ల కోసం మూడు ల్యాబ్‌‌‌‌లను ఏర్పాటు చేయాలని ఒప్పొ ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. ‘విదేశాలలో కంపెనీకి ఇదే మొదటి 5జీ ల్యాబ్‌‌‌‌. ఈ ల్యాబ్‌‌‌‌లలో 5జీ ఫోన్లకు అవసరమయ్యే కోర్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌ను మెరుగుపరుస్తాం. 5జీ జర్నీలో ఇండియాకు సాయపడతాం’ అని ఒప్పొ ఇండియా వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ తస్లీమ్‌‌‌‌ అరిఫ్​అన్నారు. ఈ కొత్త ల్యాబ్‌‌‌‌లలో లేటెస్ట్‌‌‌‌, అడ్వాన్స్డ్‌‌‌‌ టెక్నాలజీలను డెవలప్‌‌‌‌ చేస్తామని అన్నారు. పశ్చిమాసియా, ఆఫ్రికా, సౌత్‌‌‌‌ ఆసియా, జపాన్‌‌‌‌, యూరప్‌‌‌‌ దేశాలలో లాంచ్‌‌‌‌ చేసే మొబైల్స్‌‌‌‌కు కోసం ఇన్నొవేషన్స్​ను ఇండియాలోనే డెవలప్‌‌‌‌ చేస్తామని చెప్పారు.సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి 3జీపీపీ ఆర్గనైజేషన్‌‌‌‌కు మూడు వేలకు పైగా 5జీ స్టాండర్డ్‌‌‌‌ ప్రపోజల్స్‌‌‌‌ను ఒప్పో సబ్మిట్‌‌‌‌ చేసింది. యురోపియన్‌‌‌‌ టెలికమ్యూనికేషన్స్‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ప్రకారం కంపెనీ వెయ్యికి పైగా 5జీ స్టాండర్డ్‌‌‌‌ పేటెంట్లు తీసుకొంది. 5జీ పేటెంట్లను తీసుకున్న టాప్‌‌‌‌ 10 కంపెనీలలో ఒప్పో ఉందని జపనీస్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ కంపెనీ ఎన్‌‌‌‌జీబీ కార్పొరేషన్‌‌‌‌  పేర్కొంది.