జులై 1 నుంచి ఆపరేషన్ స్మైల్ 10

పాలమూరు, వెలుగు: 14 ఏళ్ల లోపు బాలబాలికల సంరక్షణ కోసం జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్​ను చేపడుతున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. ఎస్పీ చాంబర్​లో శుక్రవారం ఆపరేషన్ స్మైల్ – 10పై సమావేశం నిర్వహించారు. 14ఏళ్ల లోపు పిల్లను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టౌన్ కూడళ్ల వద్ద భిక్షాటన చేస్తున్న పిల్లలను కూడా రెస్క్యూ చేయాలన్నారు. అలాగే బాల్య వివాహలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంఅండ్​హెచ్ వో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.